English | Telugu

అవినీతిలో ముందంజలో ఉన్న రెవిన్యూశాఖ: ఏసీబీ

అవినీతికి పర్యాయపదంగా మారిపోయేలా వ్యవహరిస్తొంది రెవిన్యూశాఖ. వీఆర్వో దగ్గర నుంచి ఆర్డీవో వరకు చేయి తడపనిదే కనికరించి పరిస్థితి లేదు. ఏసీబీ రైడ్స్ లో పట్టుబడుతున్న వారిలో సగానికి సగం మంది రెవెన్యూ ఉద్యోగులే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండేళ్లలో ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు 207 మంది ఉంటే, వారిలో యాభై మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండడం ఆశ్చర్యం. నాలుగు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి తహసీల్దార్ శ్రీదేవి మూడు లక్షల లంచం తీసుకుంటూ దొరకగా, రెండు లక్షల లంచం తీసుకుంటూ ఇల్లంతకుంట తహసీల్దార్ రవి రాజ్ కుమార్, వీఆర్ కె రామకృష్ణ పట్టుబడ్డారు. ఇక మద్దివంచ వీఆర్వో శివరావు నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తకోట ఆర్డీవో, తాసీల్దార్ కలిసి లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవీనీతి రెవిన్యూ అధికారుల చిట్టా భారీగానే ఉంది అని మనకు తెలుస్తోంది.

ఇంత మంది లంచావతారులు ఉంటే ఇప్పటి వరకు వీళ్ల పేర్లెందుకు బయటకు రాలేదు ప్రశ్నార్ధకంగా ఉంది. ఏపీపీ లెక్కల ప్రకారంగా నాలుగు లక్షల రూపాయలు ల్యాండ్ మ్యుటేషన్ కోసం అటూ ఇటూ తిప్పి రైతుకు పాసుబుక్కు పట్టా ఇవ్వడం కోసం కూడా లంచాలు తీసుకుంటున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరంలో కూడా రెవెన్యూ అధికారులే అవినీతిలో ప్రధమ స్థానంలో ఉండడం గమనార్హం. మొన్న జరిగిన తహసీల్దార్ ఘటన ఇంకా మరవక ముందే తాజాగా నిన్న కూడా మెడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతిరాజ్ అధికారులకు లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున ఉన్న అవినీతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశాలు భారీగానే ఉన్నాయి.