English | Telugu
బీజేపీలోకి జంప్ అని ప్రచారం చేస్తారు.. నేను అలాంటోడ్ని కాదు.. రేవంత్
Updated : Nov 26, 2020
తనపై వచ్చే ఇలాంటి చిల్లర ప్రచారాలపై కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. నేను జెండా మోసేందుకే తప్ప.. పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదని అయన స్పష్టం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై దుష్ర్ఫచారం చేసినట్టు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నాపై దుష్ర్ఫచారం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నాకు నిర్దిష్టమైన సమాచారం కూడా ఉందన్నారు.
దుబ్బాక ఎన్నికకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నాడంటూ ఒక ఛానెల్ లోగోతో దుష్ర్పచారాం చేశారని, అక్కడి యువత అది నిజమేననుకుని గందరగోళంలో పడి బీజేపీకి ఓటేశారన్నారు. అయితే ఈ కుట్రను గుర్తించి మేము తిప్పికొట్టే సరికే 40 శాతం పోలింగ్ కూడా అయిపోయిందని, ఇప్పుడు మరోసారి ఇలాంటి కుట్రను నాపై ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు.