English | Telugu
యాచకులకు శరణార్థ శిబిరం!
Updated : Mar 29, 2020
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో తాత్కాలిక శరణార్థ శిబిరం ఏర్పాటు చేసి యాచకులను అక్కడికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన వసతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. యాచకులు అందరినీ ఆత్మీయంగా పలకరించి ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంటామని అందరి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ సందర్భంగా వారికి కొత్త దుస్తులతో పాటు గా భోజనాన్ని అందజేశారు.
ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి కూడా సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశం ఎప్పుడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ప్రతి ఒక్కరు ఇళ్ల కే పరిమితమై కరోణ మహమ్మారిని నియంత్రించాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల కావేరమ్మ పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోణ సోకిందని కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వచ్చే వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు.