English | Telugu
అయోధ్యలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం
Updated : Sep 8, 2020
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ జన్మభూమి వీలైనంత త్వరగా మందిరం పూర్తి చేయాలన్న సంకల్పంతో అయోధ్య ట్రస్ట్ శరవేగంగా పనులు చేస్తోంది. ఆలయనిర్మాణంలో మొదటిభాగంగా పునాదులు తవ్వుతున్నారు. భూమిలో వంద అడుగల మేరకు పునాదులు తవ్వేందుకు భారీ యంత్రాలను సిద్ధం చేశారు. నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఇంజినీర్లు పనులు చేపట్టారు. కాగా, ఈ పునాదులను సీబీఆర్, ఐఐటీ చెన్నై నిపుణులు డిజైన్ చేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మందిర నిర్మాణ సమితి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేసే నాటికే మందిర డిజైన్ మొత్తం పూర్తి అయ్యింది. ఇటీవలే రామ మందిరం లేఔట్ కు అయోధ్య డెవలప్ మెంట్అథారిటీ(ఏడీఏ)కూడా ఆమోదం తెలిపింది. మొత్తం లేఔట్ రెండు లక్షల 74వేల చదరపు మీటర్లు కాగా ప్రధాన ఆలయాన్ని 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు అంతస్థుల్లో నిర్మించనున్నారు.