English | Telugu
8 గంటల్లోనే రైల్వే వంతెన పునర్ నిర్మాణం!
Updated : May 8, 2020
వంతెనను మార్చడానికి వీలుగా గురువారం 07:30 - 15:30 గంటల మధ్య డౌన్ లైన్లో 8 గంటల మెగా బ్లాక్ లతో కూడి పనులు చేపట్టేందుకు చర్యలు విజయవంతం గా పూర్తి. దీనితో డివిజన్ ఎదుర్కొంటున్న 5 ప్రధాన వంతెన బ్లాక్లు లాక్డౌన్ సమయంలో రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తయ్యాయి.
మూడు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల క్రేన్లు, 4 ప్రోక్లెయినర్లు, 2 పవర్ బ్రేకర్లు, 4 టిప్పర్ లారీలు, టవర్ కార్ పరికరాలు మరియు 20 మంది కనీస సిబ్బంది శ్రమను ఉపయోగించి 8 గంటల రికార్డు సమయంలో సమీకరించడం ద్వారా రైలు రాకపోకలు కి ఎటువంటి అంతరాయం కలగకుండా పనిని పూర్తీ చేశామని డివిజనల్ ఇంజనీర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విధుల్లో భాగస్వామ్యం అయిన కార్మికుల్ని క్షుణ్ణంగా పరీక్షించడం, వారికి పిపిఇలు, శానిటైజర్లు అందించామన్నారు. పని సమయంలో భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా అన్ని భద్రతా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.
ఇటువంటి పనులు సాధారణ రోజుల్లో జరిపితే ఈ ప్రధాన మార్గంలో 200 కంటే ఎక్కువ రైళ్ల సేవల కదలికలను ప్రభావితం అవుతాయని తెలిపారు. ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చెయ్యడంతో, విజయవాడ డివిజన్ నాలుగు ప్రధాన వంతెన బ్లాక్లు పూర్తయ్యాయన్నారు. సిగరాయకొండ-టంగూటూర్ మరియు రాజమండ్రి-విశాఖపట్నం సెక్షన్ మధ్య రెండు వంతెనలు, మరియు విజయవాడ యార్డ్ వద్ద సిజర్స్ క్రాస్ఓవర్ను పిసిసి స్లీపర్లతో భర్తీ చెయ్యగలిగామన్నారు. లాక్డౌన్ కాలంలో ఇలాంటి కీలకమైన పనులు చేసినందుకు ఇంజనీరింగ్ బృందాన్ని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పి.శ్రీనివాస్ అభినందించారు.