English | Telugu
తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకి సుప్రీం ఆదేశం
Updated : Aug 14, 2025
తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకు సుప్రీం ఆదేశించింది. బీహార్ లో ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం (ఆగస్టు 14) విచారించింది. ఈ సందర్భంగా బీహార్ లో ఇటీవల నిర్వహించిన ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ)లో భాగంగా తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
అదీ ఈ నెల 19లోగా ఆ వివరాలను వెల్లడించాలని గడువు విధించింది. అదే విధంగా తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 22లోగా తమకు నివేదిక సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.