English | Telugu
సీఎం జగన్ కు డిక్లరేషన్ తలనొప్పి.. ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
Updated : Sep 23, 2020
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తాము సీఎం జగన ను రాజీనామా చేయమని అడగడంలేదని.. బ్రిటిష్ కాలం నుండి వస్తున్న ఆచారాన్ని కాపాడమని కోరుతున్నామని అన్నారు. జగన్ జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా వెళతారని, అదే హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మాత్రం ఒక్కరే వస్తారని.. దీనికి కారణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మాత్రమే తాము కోరుతున్నామని, ఇదే సమయంలో హిందూమతంపై దాడిని ఆపాలని కోరుతున్నామని ఆ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.