English | Telugu

కొన‌సాగింపు గాంధీ వ‌చ్చేశాడోచ్!

ప్రియాంక గాంధీ వాద్రా.. త‌న కొడుకు పేరు.. రెహాన్ రాబ‌ర్ట్ వాద్రా నుంచి రెహాన్ రాజీవ్ గాంధీ అనే కొత్త పేరుకు మార్పించారు. అది కూడా కోర్టు ద్వారా పూర్తి చ‌ట్ట‌బ‌ద్ధంగా. దీంతో రాహుల్ గాంధీతో అంత‌మై పోనున్న గాంధీస్ డైనాస్టీ కాస్తా.. కొన‌సాగనుంది. దీంతో రెహాన్ రాజీవ్ గాంధీ ఇలా పేరు మార్చుకున్నారో లేదో అలా కొన‌సాగింపు గాంధీగా పిలుస్తున్నారంద‌రూ.

బేసిగ్గానే ఒరిజిన‌ల్ గాంధీ కుటుంబం నుంచి దేశ రాజ‌కీయాల్లో ఎవ్వ‌రూ లేరు. గాంధీ కొడుకులున్నా వారంతా కూడా ర‌క‌ర‌కాల రంగాల్లో ఉండ‌టం వ‌ల్ల మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ కంటూ ఒక రాజ‌కీయ వార‌సుడు లేకుండా పోయారు. ప్ర‌స్తుతం గాంధీజీ మ‌న‌వళ్లుగా.. రాజ్‌మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ, అరుణ్ మణిలాల్ గాంధీ, తుషార్ గాంధీ వంటివారున్నారు. గాంధీకి నలుగురు కొడుకులు - హరిలాల్, మణిలాల్, రాందాస్, దేవదాస్. వీరి వార‌సులే వారంతా.

నిజ‌మైన గాంధీలు ఇంత మంది ఉండ‌గా.. వీరంతా కూడా రాజ‌కీయాల్లో లేక పోవ‌డంతో.. రాహుల్ గాంధీయే చివ‌రి రాజ‌కీయ‌ గాంధీగా ఉన్నారు. నిజానికి ఈ రాహుల్ గాంధీ కూడా ద ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఇందిర నెహ్రూ- ఫిరోజ్ గాంధీని పెళ్లాడ్డం వ‌ల్ల ఆమె ఇందిరా గాంధీగా మారారు అప్ప‌ట్లో. అలాగ‌ని ఫిరోజ్ గాంధీ సైతం ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఆయ‌న్ను గాంధీజీ ద‌త్త‌త తీస్కోవ‌డం వ‌ల్ల‌.. ఆయ‌న‌కా ఇంటి పేరు వ‌చ్చింది.

ఒక వేళ గాంధీ అన్న పేరే అంత గొప్ప రాజ‌కీయ నామం అయితే.. ఇక రాజ‌కీయాల్లో రాణించానుకున్న వారంతా.. గాంధీ అని పేరు పెట్టేసుకుంటే స‌రిపోతుంది క‌దా!? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఉన్న ఒరిజిన‌ల్ గాంధీల‌ను ప‌క్క‌న పెట్టి ఎక్క‌డో ఉన్న వాద్రాని గాంధీ చేయ‌డం వ‌ల్ల‌.. ఎలాంటి సందేశం ఇవ్వ‌నున్నారీ ప్రియాంక గాంధీ వాద్రా అన్న‌ది ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.

ఇందులో వాద్ర అనేది కూడా ఒక కుటుంబ‌మే. మ‌రలాంట‌పుడు ఆ కుటుంబానికున్న ఆత్మ‌గౌర‌వం త‌గ్గించుకోవ‌డం కాదా ఇదీ? ఆపై గాంధీగా త‌న కొడుక్కి పేరు మార్చ‌డం వ‌ల్ల ప్రియాంక అంత విలువ లేని కుటంబానికి కోడ‌లిగా వెళ్లిన‌ట్టా? మ‌రి అత్తింటి కుటుంబ గౌర‌వాన్ని ఇది త‌గ్గించ‌డం కాదా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.

గాంధీ అన్న పేరు పెట్ట‌గానే గొప్ప వాళ్ల‌యిపోతే.. మ‌రి గాంధీజీకి పుట్టిన న‌లుగురు కొడుకులు వారికి పుట్టిన పిల్ల‌లు ఆ పిల్ల‌ల‌కు పిల్ల‌లూ.. రాజ‌కీయంగా ఎంతో ఎత్తుల‌కు ఎదిగి పోవాలి క‌దా!? మ‌రి వారు ఎందుక‌ని అంత‌టి రాజ‌కీయ అనామ‌కులుగా మిగిలిపోయారు??? అన్న చ‌ర్చ‌కు తెర‌లేస్తోందీ ప్రియాంక గాంధీ వాద్రా చ‌ర్య‌ల వ‌ల్ల అంటున్నారు కొంద‌రు.