English | Telugu
ఆరోగ్యకర అలవాట్లతో కొరోనాను నిరోధించవచ్చు
Updated : Mar 6, 2020
ఆందోళన వద్దు. భయభ్రాంతులకు గురికావద్దు.
మన రోగనిరోధకశక్తే మనకు రక్ష అంటోంది జన విజ్ఞాన వేదిక.
చైనాలో 80వేల మందికి కొరోనా వైరస్ సోకగా 50వేల మందికి ఇప్పటికే నయమైంది. కేవలం 3వేల మంది మాత్రమే చనిపోయారు. 4% మంది కూడా చనిపోలేదు. సాధారణ ఫ్లూ వైరస్ తో కూడా ఇంతకంటే ఎక్కువ మంది చనిపోతారు. కావున ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదు.
వృద్దులు, గర్భిణి స్త్రీలు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు హై రిస్క్ గ్రూపు.
కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 100 - 250nm సైజులో ఉంటాయి.
అందరూ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. కరోనా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు N95 మాస్కులు ఖచ్చితంగా వాడాలి.
దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు సాధారణ మాస్కులు వాడాలి. ఆవీ లేకపోతే జేబురుమాళ్ళు వాడాలి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా జేబురుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. జేబురుమాలు లేకపోతే మోచేతిని బెండ్ చేసి నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మన నోటి తుంపర్లు ఇతరుల మీద పడకుండా జాగ్రత్త పడాలి.
ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు. మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా నోరు, ముక్కు, కండ్ల ద్వారా మనకు చేరుతుంది.
కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.
కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
ఈ వైరస్ గనుక, 26-27 ° C ఉష్ణోగ్రత ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. ఇప్పటి మన ఎండలకు రూమ్ టెంపరేచర్ లో కూడా ఈ వైరస్ బ్రతకలేదు.
AC గదుల్లో, వాహనాళ్లో ఉండేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాంటి చల్లని పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.