English | Telugu
ప్రార్ధనా విశ్వాసాలు పక్కన పెట్టి, ప్రాక్టికల్ గా ఆలోచించండి
Updated : Mar 28, 2020
ముక్కువాసన కోల్పోవడం, నాలుక రుచి తెలియకపోవడం, గొంతుమంట, దగ్గు, జలుబు, జ్వరం మరియు గుండె దడ లాంటి లక్షణాలు కనబడగానే SELF ISOLATION పాటించి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి వెళ్ళాలి. కార్ఫోరేట్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ప్రభుత్వ వ్యవస్థే నడుస్తుంది. 3వ దశకు చేరితే నియంత్రించుట కష్టం. కావున సూచనలు పాటించి జీవించడమే. యజ్ఞాలు,యాగాలు చెసే వాళ్ళు ప్రస్తుత స్థితి నుండి కాపాడలేరు.
మృత్యుంజయ హోమం, ఏసుపాదాలు తాకడం, అల్లా ప్రార్థన చేయడం, యజ్ఞాలు, యాగాలు చేయడం అవివేకం. మానవుడు తన బలహీనతను దైవం అనే అనుగ్రహం మీద పెట్టి మనశాంతి పొందడం అనాదిగా ఆనవాయితి.
కాబట్టి సామాజిక దూరం పాటించడం,చేతులు కడగటం,నీళ్ళు త్రాగడం, సి.ఎం. కేసీఆర్ చెప్పినట్లు ప్రోటీన్ ఆహారం తినడం, బాహ్య సంచారం మానడం, ఉమ్మడం, దగ్గటం, చీదటం మానటం లేదా గుడ్డ అడ్డు పెట్టుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మాత్రమే కరోనా నుండి కాపాడుతుంది. మనకు ఇమ్యునిటి ఉంటే వ్యాధి సోకినా ఇబ్బందులు పడి కోలుకుంటాం. ధైర్యంగా కరోనాను ఎదుర్కొందాం.