English | Telugu

వైఎస్సార్సిపిలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు

వైఎస్సార్సిపి లో ఎస్సి నాయకులు థర్డ్ గ్రేడ్ నాయకులుగా మిగిలిపోవాల్సిందేనా...?
వైఎస్సార్సిపి కి గుడ్ బై చెప్పే ఆలోచనలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్...
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజీకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం...

151 సీట్లు గెలిచి 10 నెలలు కాకముందే వైకాపా ఎస్సి నాయకుల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడుతుంది.స్థానిక ఎన్నికల నేసథ్యంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఏకంగా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.రెడ్డి నాయకుల ఆధిపత్య పోరులో ఎస్సి నాయకులు నలిగిపోతున్నారు.కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుంది.ఆర్ధర్ ని నమ్ముకున్న నాయకులు,కార్యకర్తలను అధిష్ఠానం నీచంగా చూడటం,కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయాలనే వదులుకోవాలి అనే ఆలోచనకి వచ్చారు.రెడ్డి నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాళ్ళ కింద 10 నెలల నుండి నలిగిపోతూ కక్క లేక,మింగ లేక నలిగిపోయారు ఆర్డర్,ఆయన అనుచరులు.కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తన వర్గానికి న్యాయం జరుగుతుంది అని భావించి మరోసారి అవమానపడ్డారు.తన వర్గానికి న్యాయం జరగలేదు కనీసం భీ-ఫార్మ్ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదు అని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హుక్కుమ్ జారీ చేసారు.ఎమ్మెల్యే పక్కనే ఉన్నా భీ-ఫార్మ్ లు మాత్రం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చి ఆర్ధర్ ని ఘోరంగా అవమానించి పంపారు.ఇంత కాలం నియోజికవర్గంలో పేరుకి మాత్రమే ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల అమలు ఇలా ఏ కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ ఉండదు.అన్ని బైరెడ్డి ప్రారంభిస్తారు.

కనీసం కొన్ని కార్యక్రమాలకు సమాచారం కూడా ఇవ్వరు.ఇప్పుడు కనీసం 10 శాతం సీట్లు కూడా తన వర్గానికి ఇప్పుంచుకోలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యే ఆర్డర్.దింతో ఇంతకాలం జగనన్న ఉన్నారు,అయన వింటారు అని నమ్మకం పెట్టుకున్న ఆర్ధర్ కి స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసలు విషయం తెలిసింది.జరిగే ప్రతి చర్య అధిష్టానం కి తెలిసే జరుగుతుంది అని గ్రహించిన ఆర్ధర్ ఇక రాజీకీయాలకు,ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రధాన కారణం నమ్ముకున్న కార్యకర్తలకు కనీస న్యాయం కూడా చేయలేకపోవడం వారి ముందు ఆర్ధర్ మొహం చెల్లకపోవడం వలన ఫైనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.