English | Telugu

పీవోకే దానంతట అదే భారత్ లో భాగం అవుతుంది.. రాజ్ నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనంన చేసుకోవడానికి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదన్న ఆయన ఆ ప్రాంత ప్రజలే పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు. వారే స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేస్తారని పేర్కొన్నారు.

మొరాకోలో పర్యటిస్తున్న రాజ్ నాథ్ సింగ్ అక్కడి భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. పాక్ఆక్రమిత కాశ్మీర్ భారత్ దేనని తాను ఐదేళ్ల కిందటే చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్బంగా గుర్తు చేశారు. దాడి చేసో, యుద్ధం చేసో పీవోకేను స్వీధీనం చేసుకోవలసిన అవసరం లేదన్న ఆయన దానంతట అదే భారత్ తో భాగమౌతుందనీ, ఆ రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.