English | Telugu
ప్రధాని మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన
Updated : Dec 18, 2020
మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఓఎల్ఎక్స్ లో ఆ ప్రకటనను తొలగింపజేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చాడని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.