ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఆయనకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితుల తీవ్రత పై చర్చించేందుకు కేంద్రం ఆధ్వర్యం లో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదలైనవారు హాజరయ్యారు. ఈ పరిస్థితులలో సత్యేంద్ర జైన్ కరోనా పాజిటివ్ తేలడం తో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
కల్కాజీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి కి జలుబు, దగ్గు లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో పక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుండటం తో ఆయనకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది.