English | Telugu

హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ప్లాస్టిక్ పాలు!!

మనం ఎన్నో రకాల కల్తీలు చూస్తుంటాం. కానీ స్వఛ్చంగా భావించే పాలు కూడా ప్లాస్టిక్ ఐతే అనే ఆలోచన అందరిలో అలజడి రేపుతోంది .హైదరాబాద్ లో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి. పాల ప్యాకెట్ ను కట్ చేసి కాగబెట్టి గానే ప్లాస్టిక్ ముద్దగా మారిపోతున్నాయి. ఇలాంటి పాలను ఏమరపాటుగా తాగితే అంతే సంగతులు. ప్రగతినగర్ లో ఈ కల్తీ పాల వ్యవహారం బయటపడింది.

పవన్ సౌమ్య దంపతులు ప్రగతినగర్ లో నివాసముంటున్నారు. ప్రగతినగర్ చౌరస్తా వద్ద ఉన్న సాయితేజా మిల్క్ సెంటర్ లో రెండు పాల ప్యాకెట్ లను కొని ఇంటి కి తీసుకొచ్చాడు పవన్. భార్య సౌమ్య ఒక అర లీటర్ ప్యాకెట్ ను గిన్నెలో పోసి స్టౌ పై కాగపెట్టింది.పాలు ఒక్కసారి గా విరిగిపోయి ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. గిన్నె ఏదైనా బాలేదేమోనని మరోక పాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టారు. ఆ పాలు కూడా ప్లాస్టిక్ ముద్దగా మారడంతో సౌమ్యా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. పాల గురించి మిల్క్ సెంటర్ నిర్వాహకుడు నరసింహను ప్రశ్నిస్తే అతను దురుసుగా సమాధానమిచ్చాడు.ఈ పాలను చిన్నపిల్లలు తాగితే ప్రాణానికే ప్రమాదమని ఇలాంటి పాలను అమ్మవద్దని చెప్పినా నిర్వాహకుడు పట్టించుకోలేదు.ఇక చేసేది లేక పవన్ దంపతులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

"ఎప్పడు తమకు పాలు పోసే పాలవాడు దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లిన కారణంగా తాము దగ్గరలో ఉన్న పాల బూత్ కు వెళ్లి పాలు తెచ్చుకున్నామని,కానీ అవి కాచిన వెంటనే ప్లాస్టిక్ ముద్దగా మారటం చూసి ఆశ్చర్యపోయామని బాధితుదు తెలియజేశారు.ఇలా జరగటం పై ఆ బూత్ యజమానిని ప్రశ్నించగా అతడు దురుసుగా ప్రవర్తించిన తీరును వ్యక్తం చేశాడు".అభం శుభం తెలియని పసి పిల్లలు ఈ పాలను తాగితే వారి ప్రాణాలకే ప్రమాదం ఉండవచ్చు.అసలు ఇటువంటి కల్తీ సరుకుని అనుమతిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఏం చేస్తున్నారోనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.