English | Telugu
ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి ప్రశంసా పత్రాలు...
Updated : Oct 23, 2019
ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ మల్కాజిగిరి లోని మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్థానికులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని తీర్మానం చేశారు. గత పది రోజులుగా కాలనీ లోని ప్లాస్టిక్ కాగితాలు ఏరిన వారికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ప్లాస్టిక్ ని వాడద్దు, ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధించాలంటూ మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సదస్సుకు హాజరైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాట్లాడుతూ, రెండు వేల జూట్ బ్యాగ్స్ ను ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లతో ఇరవై నిమిషాల పాటు సమయాన్ని గడిపి ప్లాస్టిక్ మీద అవగాహన తీసుకురావటం జరిగిందన్నారు. రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టిన ఈ యుద్ధం ఇప్పుడు మోదీగారి పుణ్యమా అంటూ ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పటం వల్ల ప్రతి ఒక్క డిపార్టుమెంటు, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్లాస్టిక్ మీద యుద్ధం మరల మొదలు పెట్టారని అన్నారు.
ఇది చాలా సంతోషంగా అనిపించింది అని ఇటీవలె పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు వారం రోజుల నుంచి ప్లాస్టిక్ విసర్జన కార్యక్రమం మొదలుపెట్టారని ఇది చాలా కష్ట తరంగా ఉందని అన్నారు. ఎందుకంటే గ్రామాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో పప్పు ఉప్పు వేసుకుంటున్నారని, వాటివల్ల క్యాన్సర్ వస్తుందన్నా కూడా తొందరగా వాళ్ళు ఎలాంటి అవగాహన చేసుకోలేకపోతున్నారన్నారు.