English | Telugu

తప్పని తిప్పలు.. కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం

జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది, గంగాధర క్రాస్ రోడ్స్ లో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ప్రయాణ సమయంలో బస్సు లో అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు నిలిచిపోవడంతో కిందకు దిగి తోసి ప్రయాణికులు చమటలు కక్కారు. తాత్కాలిక డ్రైవర్ కావటంతో నానా పాట్లు పడ్డారు, తమ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు, దీంతో వారికి డబ్బులు తిరిగి చెల్లించారు.

తాత్కాలిక డ్రైవర్ లతో అటు ప్రమాదాలు జరుగుతూ ఉండగా ఈరోజు సాంకేతిక లోపంతో బస్సులు ఆగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. సమస్యలైతే ఉత్పన్నమవుతూనే ఉన్నాయి, వీటి పరిష్కారం దిశగా అధికారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకైతే అటు ప్రభుత్వం గానీ అధికారులు గానీ తాత్కాలిక డ్రైవర్ లు, కండక్టర్ లతోనే బస్సులు నడిపిస్తున్నారు. నిన్న కరీంనగర్ నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వేములవాడకు వెళుతుండగా ఆ బస్సు వెంకట్రావుపేట దగ్గర డీజిల్ లేక ఆగిపోయింది.

తాజాగా ఈ రోజు కరీంనగర్ జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సు గంగాధర ఎక్స్ రోడ్ దగ్గర సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది. బస్సు అలా రోడ్ మద్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు బస్సులు నడిపిస్తున్న వారంతా తాత్కాలిక డ్రైవర్లు కావడంతో బస్సులో వచ్చే సాంకేతిక లోపాలను అప్పటికప్పుడు బాగుచేసే నైపుణ్యం ఉండదు కాబట్టి ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.