English | Telugu

కర్నాటకలో రైల్వే యార్డ్ మరమ్మత్తులు..  తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల రద్దు

కర్నాటకలోని బయ్యప్పనహళ్లి వద్ద యార్డ్ మోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకూ ఏపీ నుంచి కర్నాటకకు రాకపోకలు సాగించే పలు సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య ఓ ప్రకటనలో తెలిపింది. తాజా మార్పులతో జరిగే లింక్ ట్రైన్ల ఆలస్యం కారణంగా విశాఖ- లోక్ మాన్య తిలక్ స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ ప్రైస్ రైలు ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడిచే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లను యార్డ్ మోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకూ పూర్తిగా రద్దు చేశారు. పాట్నా-బాన్స్ వాడీ మధ్య నడిచే రెండు రైళ్లను కృష్ణరాజపురం-బాన్స్ వాడీ మధ్య పాక్షిక రద్దు చేశారు. అలాగే సంబల్ పూర్ – బాన్స్ వాడీ మధ్య నడిచే రెండు రైళ్లను కూడా కృష్ణరాజపురం-బాన్స్ వాడీ మధ్య పాక్షిక రద్దు చేశారు. ఇవాళ విశాఖపట్నం నుంచి లోక్ మాన్య తిలక్ స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు కూడా రద్దయింది. మేడ్చల్ నాందేడ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇవాళ మేడ్చల్- నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అదికారులు ప్రకటించారు.