English | Telugu
పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు! వైసీపీ ఎంపీకి సునీత స్ట్రాంగ్ కౌంటర్
Updated : Dec 10, 2020
దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పరిటాల రవి ఫ్యాక్షనిజం, నక్సలిజం పేరుతో ఎంతోమంది తలలను నరికారని ఆయన కామెంట్ చేశారు. చంద్రబాబు అండతో రవి దుర్మార్గాలు చేశారని మాధవ్ ఆరోపించారు. రాప్తాడు ప్రాంతంలోని పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే... రవి ఆ పొలాలను రక్తంతో తడిపారన్నారు వైసీపీ ఎంపీ. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.