English | Telugu

ద‌ళితుల ఆత్మాభిమానాన్ని ఎందుకు ప‌ణంగా పెడుతున్నారు?

దొరగారిచేత శభాష్ అనిపించుకోవాలనే తాప‌త్ర‌యం. క‌మీష‌న్ల మీద వున్న దృష్టి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై వుండ‌టం లేదు. చెన్నూరు నియోజకవర్గ సమస్యలు ప‌ట్టించుకోకుండా ఎమ్మెల్యే బాల్క సుమన్ బానిస సుమ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారని స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఎం.పి .రేవంత్ రెడ్డి చిన్న దొర కేటీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడికి వెళ్తే ఆగమేఘాల మీద, హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి దొర గారి చేత శభాష్ అనిపించుకున్నార‌ట ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌.

ఉస్మానియా యూనివర్సిటీ భూములను టీఆరెస్ పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నాఎమ్మెల్యే గారికి క‌నిపించ‌లేద‌ట‌. సేవ్ ఉస్మానియా పేరుతో ఉద్యమం జరుగుతుంది, తక్షణం యూనివర్సిటీకి రూ.700 కోట్లు అవసరం ఉంది అయినా బాల్క సుమన్ త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు అస‌లు స్పందించ‌డం లేద‌ని యూనివ‌ర్శిటీ విద్యార్థులు సైతం మండిప‌డుతున్నారు.

యూనివర్సిటీ విద్యార్థి కార్డు మీద ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి, ఏనాడు యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడ లేదు. కొఠారి కమీషన్ చెప్పినట్టు బడ్జెట్ లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించేలా చూడాలని తెలియకపోవడం సిగ్గుచేటని ఉస్మానియా విద్యార్థులంటున్నారు.

నీళ్ళు, నిధులు, నియామకాలే ప్రధానంగా ఉద్యమించిన తెలంగాణలో నియామకాలు లేక, బ్రతుకుదెరువు లేక తెలంగాణ కోసం ఉద్యమించిన డాక్టరేట్ పొందిన నిరుద్యోగులు గత్యంతరం లేక యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వ నియామక పరీక్ష రాసి మెరిట్ వచ్చినా సెలెక్టెడ్ లిస్ట్ మీరు పెట్టకపోవడంతో చూసి చూసి మహిళ ఆత్మహత్య చేసుకున్నా విద్యార్థి నేత నుంచి ప్ర‌స్తుతం అసెంబ్లీకి వెళ్ఙ‌న సుమ‌న్‌గారికి కనిపించదు.

దళిత కార్డు మీద సీటు పొందిన మీరు దళిత ముఖ్యమంత్రి హామీ, దళితులకు మూడెకరాల భూమి కోసం మాట్లాడరు. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకర్తలే పి.యె కి ఫోన్ చేసి చేసి అలసిపోతుంటే ఇక ప్రజల సమస్యల గురించి, ద‌ళిత ఉద్య‌మాల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడుకోవడం వ్యర్థమే.

గెల‌వ‌డానికే ద‌ళిత కార్డు కావాలి. ఆ త‌రువాత‌ దొర‌గారి ఆశీస్సులుంటే చాలు. ఆంధ్ర‌లోనైనా, తెలంగాణాలోనైనా కొంత మంది ద‌ళిత నేత‌ల వ్య‌వ‌హార‌శైలి.