English | Telugu

ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ 

కరోనా నిబంధనలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామని సర్క్యులర్ జారీ చేసిన పార్లమెంటు వర్గాలు ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఉభయసభల సమావేశాలను ఒకేసారి కాకుండా ఉదయం రాజ్యసభ సమావేశాలను, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలను నిర్వహించనున్నారు. అంతేకాదు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున శని,ఆదివారాల్లో కూడా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌ వర్గాలు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేశాయి.