ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తమ సరదాల కోసం యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు అభ్యంతరకరమైన యాప్ లను రూపొందించి యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కొన్నింటిపై భారత్ ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం ఐదు ప్రధాన డేటింగ్ యాప్ లపై నిషేధం విధించింది. టిండర్, గ్రిండర్, ట్యాగ్ డ్, స్కౌట్, సే హాయ్ వంటి డేటింగ్, లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు స్థానిక చట్టాలను అతిక్రమిస్తున్నాయంటూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ ఆరోపిస్తోంది. తమ కంటెంట్ ను మార్చుకుంటే, స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉంటే నిషేధం అంశంపై పునరాలోచిస్తామని అథారిటీ తెలిపింది.
ఈ యాప్ ల్లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించాల్సిందిగా గతంలోనే నోటీసులు ఇచ్చామంటున్నారు. అయితే నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు స్పందించలేదని అందుకే వాటిపై నిషేధం విధించాల్సి వచ్చిందని పాక్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ వెల్లడించింది.