English | Telugu

నిజాముద్దీన్ లెక్క తేల్చిన ఢిల్లీ పోలీసులు!

ఢిల్లీ మర్కజ్‌ మసీదులో జ‌రిగిన మూడు రోజుల కార్య‌క్ర‌మంలో మొత్తం 1,830 మంది హాజరు కాగా వీరిలో 16 దేశాలకు చెందిన 281 మంది విదేశీయులని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
వీరిలో ఇండోనేషియా 72, శ్రీలంక 32, మయన్మార్‌ 33, కిర్గిస్థాన్‌ 28, మలేసియా 20, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల నుంచి తొమ్మిది మంది చొప్పున, థారులాండ్‌ 7, ఫిజీ 4, ఇంగ్లాండ్‌ 3, ఆప్ఘనిస్థాన్‌, అల్జీరియా, జైబూటీ, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 711 మంది, తమిళనాడు నుంచి 501, అసోం 216, ఉత్తర ప్రదేశ్‌ 156, మహారాష్ట్ర 109, మధ్యప్రదేశ్‌ 107, బీహార్‌ 86, పశ్చిమ బెంగాల్‌ 73, తెలంగాణ 55, జార్ఖండ్‌ 46, కర్ణాటక 45, ఉత్తరాఖండ్‌ 34, హర్యానా 22, అండమాన్‌ నికోబార్‌ దీవులు 21, రాజస్థాన్‌ 19, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశాల నుంచి 15 మంది చొప్పున, పంజాబ్‌ 9, మేఘాలయ నుంచి ఐదుగురు ఈ ఇస్త‌మాలో పాల్గొన్నట్లు గుర్తించారు.

పశ్చిమ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో ప్రార్థనలకు హాజరైన తమ రాష్ట్ర వ్యక్తులను గుర్తించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌ తోపే అధికారులను ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన పర్యటనను రద్దు చేసుకొని మంగళవారం రాష్ట్ర రాజధాని చేరుకున్నారు. నిజాముద్దీన్‌ పాజిటివ్‌ కేసుల కలకలం నేపథ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.