English | Telugu
అవినీతి, కులం, కుటుంబం కోరల్లో చిక్కుకున్న ఏపీ.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Updated : Jun 27, 2020
గత ఆరేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగ పడే కిసాన్ సమ్మాన్ యోజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పై దర్యాప్తు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం వరల్డ్ బ్యాంక్, ఎడిబి వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకుని తెచ్చిన ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు అమలు చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు. కారణాలేవైనా కానీ అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేస్తే (పీపీఏ ల రద్దు) రాష్ట్రానికే కాక దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆమె అన్నారు. ఎన్నికల టైం లో వాగ్దానం చేశామని ఇలా అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయడం సరి కాదని ఆమె అన్నారు.
ఇదే సమయంలో కేంద్రం రూ 2.70 కే కరెంట్ ఇస్తుంటే రాష్ట్రం మాత్రం రూ 9 వసూలు చేస్తోందని చెపుతున్నారని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంట ధర పెట్టి కరెంట్ కొని వ్యాపారం చేయడమా సాధ్యమేనా అని ఆమె వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా పై పోరాటానికి కేంద్రం ఏపీకి 8,025 కోట్లు ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మిత్ర పక్షమైన జనసేన ను పవన కళ్యాణ్ ను ఆమె ప్రశంసించారు.