English | Telugu

ఆర్వో ప్యూరిఫైయర్లను బ్యాన్ చేయండి.. ఎన్ జి టి కీలక ఆదేశాలు

మనం బయటికి ఎక్కడికి వెళ్లినా ముందుగా వెదికేది ఆర్వో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కోసమే. ఐతే తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జి టి) ఆర్వో ప్యూరిఫైయర్లను ఈ సంవత్సరం చివరిలోగా పూర్తిగా బ్యాన్ చేసేలా నోటీసులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖను మంగళవారం ఆదేశించింది. దీనికి కారణం మనం తాగే లీటర్ నీటిలో టోటల్ డిజాల్వాడ్ సాలీడ్స్ (TDS) 500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. ఐతే ఆర్వో ప్యూరిఫైయర్లు నీటిలో సహజంగా ఉన్న ఖనిజాల్ని పూర్తిగా తీసి వేసి మళ్లీ ఖనిజాల్ని కలుపుతున్నాయనీ ఐతే దీని వల్ల ప్రజలకు నీటి ద్వారా దక్కాల్సిన సహజమైన ఖనిజాలు దక్కట్లేదని ఎన్ జి టి అభ్యంతరం తెలిపింది.

ఆర్వో ప్యూరిఫైయర్ల పనితీరును ముందుగా ఒక నిపుణుల కమిటీ పరిశీలించింది. అవి నిబంధనల ప్రకారం లేవనీ, వాటి ద్వారా ప్యూరిఫై అయిన నీటిలో మినరల్స్ ఉండట్లేదని ఆ బృందం తేల్చింది. దీంతో మినరల్స్ లేని నీటిని తాగితే ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒక లీటర్ నీటిలో TDS 500 మిల్లి గ్రాముల కంటే తక్కువ ఉండకూడదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ జి టి కేంద్రానికి డిసెంబర్ 31 వరకూ టైమ్ ఇవ్వడంతో అప్పటిలోగా ఆర్వో ప్యూరిఫైయర్ల పై బ్యాన్ అమల్లోకి తేవాల్సి ఉంటుంది.