English | Telugu
కేటీఆర్ క్రేజ్.. ఫోటో కోసం ఎగబడుతున్న నేతలు!
Updated : Jan 30, 2020
మునిసిపల్ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సభ్యులు యువనేత కేటీఆర్ తో ఫోటోలకు క్యూ కడుతున్నారు. కొత్తగా గెలిచిన సభ్యులతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు కేటీఆర్. వారి కోరిక మేరకు ఒక్కొక్కరితో చాలా ఓపిగ్గా వందల మందితో కేటీఆర్ ఫోటోలు దిగుతున్నారు. కేసీఆర్ తర్వాత రాష్ర్టానికి కాబోయే సీఎం కేటీఆర్ అనే వార్తలు ఈ మధ్య కాలంలో జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ తో ఫోటో అంటే టిఆర్ఎస్ సభ్యుల్లో క్రేజ్ పెరిగింది. మునిసిపల్ సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా పోటా పోటీగా ఫోటోలు దిగుతున్నారు. మూడు రోజుల పాటు దాదాపు 2000 మందితో కేటీఆర్ ఫొటోలు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఫోటోలు దిగుతున్నారు. వారిని కాదనకుండా కేటీఆర్ ఫోటోలకు ఓకే అంటే ఫోటోలు దిగిన వారు మాత్రం కాబోయే సీఎంతో ఫోటో అని సోషల్ మీడియాలో క్యాప్షన్ లు పెట్టడం మాత్రం కేటీఆర్ కు నచ్చలేదని తెలుస్తోంది. కేవలం ఓ జ్ఞాపకం కోసం మాత్రమే ఫోటోలు వాడుకోవాలి కానీ సోషల్ మీడియాలో ఫొటో అప్ లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలని కేటీఆర్ సున్నితంగా సూచన చేసినట్టు తెలుస్తోంది. కాబోయే సీఎం అంటూ క్యాప్షన్ పెట్టొద్దని సున్నితంగా నేతల్ని హెచ్చరించారు. మొత్తానికి కేటీఆర్ తో ఫోటో సెషన్ ఇప్పుడు టిఆర్ఎస్ లో క్రేజీగా మారింది.