English | Telugu

విశాఖకు చేరిన సిట్ బృందం...

విశాఖలో భూస్కాంపై వైకపా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం మొదటిసారిగా విశాఖకు చేరుకుంది. ప్రస్తుతానికి అతిథి గృహంలో బస చేస్తున్న విజయ్ కుమార్ బృందం విచారణ ప్రారంభించబోతోంది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులతో విజయ్ కుమార్ భేటీ అవుతారు. విశాఖలో భూ కుంభకోణం ఆరోపణలపై అప్పట్లో టిడిపి ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఆ నివేదిక బయటకు రాలేదు. దీంతో రెండు వేల పదిహెడులో సిట్ నివేదించిన అంశాలు భూ ఆక్రమణ ఎంత మేర జరిగింది, వాటిల్లో ఎవరెవరి ప్రమేయం ఉంది, రాజకీయ నాయకుల హస్తం ఎంత, కేసు నుంచి తప్పించుకున్న అధికారులెవరు ఇలా అనేక అంశాల పై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఎవ్వరినీ వదలొద్దు అంటూ ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ స్కాం వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు జిల్లా ఉన్నతాధికారుల తోనూ, కలెక్టర్ తోనూ భేటీ కానున్నారు సిట్ అధికారులు. ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళకు మూడు నెలల కాలన్ని విచారణకు నిర్దేశించింది. మూడు నెలల కాలంలోనే విచారణ చేపట్టాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఈ నేపథ్యం లోనే బాధితులు, చాలామంది ఫిర్యాదు దారులు, బాధితుల బంధువులు కూడా వీళ్లని కలిసేందుకు వస్తారు కాబట్టి విచారణకు సంబంధించినటువంటి బిల్డింగ్ ని పరిశీలించడంతో పాటు, ఏ మేర దీనిపై విచారణ చేపట్టాలి, ఎక్కడ విచారణ చేపట్టాలి అనేటువంటిది గతంలో కూడా సిట్ దర్యాప్తు జరిపింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భూ రికార్డుల్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కారణంగానే సిట్ విశాఖకు రావటం జరిగింది.