English | Telugu
చైనా అండతో రెచ్చిపోయి కాల్పులు జరిపిన నేపాల్..
Updated : Jul 20, 2020
తాజాగా నేపాల్ మరో దుశ్చర్యకు పాల్పడింది. బీహార్‌లోని కిషన్ గంజ్ సరిహద్దుల్లో ఆదివారం నాడు భారత నేపాల్ సరిహద్దులలో పశువులను కాస్తూ వెళ్లిన జీతేంద్ర కుమార్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. భారత నేపాల్ సరిహద్దుల్లోని ఫతేపూర్‌లోని తెహ్రగచ్‌లో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నేపాల్ పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో జీతేంద్ర సింగ్ గాయపడడంతో అతనిని హాస్పిటల్ కు తరలించినట్లు కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ తెలిపారు. ఐతే కాల్పుల నుంచి మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని అయన తెలిపారు. ఈ ఘటన తో స్థానికల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ఘటనపై తాము విచారణ చేపట్టామని అలాగే నేపాల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నామని కిషన్ గంజ్ డీఎస్పీ తెలిపారు.