English | Telugu
ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట: లోకేష్
Updated : Jul 25, 2020
"నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వైకాపా నాయకులు తొలగిస్తుండగా అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడాను. ఐదుగురు టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటా అని హామీ ఇచ్చాను." అని లోకేష్ తెలిపారు.
"తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుంది. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట." అని లోకేష్ చెప్పారు.