English | Telugu

సీఎం జగన్ సొంత ఊరిలోని మహిళకే రక్షణ లేదు.. లోకేష్ ఫైర్ 

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని అయితే వాటిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేసారు. సాక్షాత్తు సీఎం జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అయన విమర్శించారు. ప్రభుత్వం కేవలం చట్టాల పేరు చెబుతూ కాలయాపన చేస్తోంది తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని అయన మండిపడ్డారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఈ విమర్శలు చేశారు.

"రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. అయితే ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి జగన్ ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. అంతేకాకుండా ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.