English | Telugu

స్పెషల్ క్లాసులకు వెళ్ళిన విద్యార్ధినులపై లైంగిక వేధింపులు...

స్పెషల్ క్లాసెస్ కి వెళ్ళిన విధ్యార్ధినులతో వెకిలి చేష్టలకు దిగుతున్నాడు ఓ ప్రొఫెసర్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోని నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఒక అధ్యాపకుడి దాష్టీకం ఇది. మార్కులు కావాలన్నా, ప్రాజెక్ట్ వర్కులు పూర్తి చేయాలన్నా, పి.హెచ్.డి లాంటి ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా నేను చెప్పినట్టు వినాలని చెప్పి విధ్యార్ధినులను లోపరుచుకుంటున్నాడని, యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా డిపార్టుమెంట్ హెడ్ గా పని చేస్తున్న సూర్య రాఘవేంద్ర స్పెషల్ క్లాసులంటూ విద్యార్థినుల్ని తన ఫ్లాట్ కు పిలుస్తున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత లైంగిక వేధింపులకు దిగుతున్నారని విద్యార్ధినులు చెబుతున్నారు. అంతేకాదు చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సీఎం జగన్ కి లేఖ రాసి బాధిత విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నత విద్యాశాఖ ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

అయితే ప్రొఫెసర్ రాఘవేంద్ర మాత్రం తాను క్లాసులకు రమ్మని చెప్తే ఆ క్లాసులకు రావటం ఇష్టం లేనివాళ్ళు తనపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం సెలవులు కారణంగా విధ్యార్ధినులు క్యాంపస్ కు రాకపోవటంతో వారు వచ్చిన తరువాత విచారణ చేపట్టి ఆ తరువాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై విధ్యార్ధినుల తల్లి తండ్రులతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.