English | Telugu

మీరు ఎంత సేఫ్‌గా ఉన్నారు? ఎంత రిస్క్‌లో ఉన్నారు?

రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు, కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈ రోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారా?..... మీకు తెలియని విషయం ఏంటంటే మీరు సాధించింది.... క, రో, నా, ని!?...

మీరు ఒకేసారి 21 రోజులకీ కావలసినవి తెచ్చుకోవాలి. ఆ తర్వాత బయట నుండి ఏమీ ఇంట్లో కి తేవొద్దు. లాక్ ద డోర్. తాళం మళ్ళీ 21 రోజులు తర్వాత తీయాలి. అది లెక్క‌..... ఇప్ప‌ట్టికైనా అర్థం అయి స‌చ్చిందా?.....

తాళం వేసిన 4 వ రోజు వరకు మీ కుటుంబం లో ఎవరికీ దగ్గు, జలుబు, జ్వరం లేకపోతే మీ కుటుంబం 50% సేఫ్. 14వ రోజు వరకు రాకపోతే మీ కుటుంబం 90% సేఫ్. 21వ రోజు వరకు ఏ లక్షణాలు కనపడకపోతే మీరు మీ కుటుంబం 100% సేఫ్. శ‌భాష్ ఇప్పుడు మీరు క‌రోనా కాటు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు.

మధ్యలో ఒక్క రోజు బయటకు వెళ్ళినా,.... బయట వస్తువు ఇంట్లో కి తెచ్చినా.... అప్పటి నుండి మళ్ళీ 21 రోజుల లాక్ డౌన్ కొనసాగాల్సిందే. స్వీయ‌నింత్ర‌ణ చేయాల్సిందే. అది విష‌యం.

కరోనా చివరి పేషెంట్ ఐసొలేట్ అయిన తర్వాత 21 రోజుల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. అందరూ సహకరిస్తే నే తొందరగా దేశంలో నార్మల్ లైఫ్ వస్తుంది.

సగటున కరోనా ఎటాక్ అయిన 4వ రోజు జ్వరం, 7వ రోజు ఊపిరితిత్తుల ఫెయిల్ తో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, వెంటనే వెంటిలేటర్స్ పెట్టకపోతే రక్తం లో ఆక్సిజన్ అందక యాంటీబాడీస్ పెరిగి 10వ రోజుకల్లా కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి, అలా మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో దారుణ‌మైన చావు త‌ప్ప‌దు. నీటిలోని చేప‌ను రోడ్డుపై వేస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకొని ద‌య‌నీయమైన చావు చావాల్సిందే.

CDDEP వారి అంచనా ప్రకారం 25 కోట్ల మంది కి ఏప్రిల్ నెల మధ్య నాటికి కరోనా సోకుతుంద‌ట‌. అందులో మీరు ఉంటారా? లేక ఇంట్లోనే ఉంటారా? తేల్చుకోవాల్సింది మీరే.