English | Telugu
అమరావతి రైతులకు న్యాయం జరిగి తీరుతుంది.. వైసీపీ ఎంపీ
Updated : Aug 20, 2020
అంతేకాకుండా విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, శ్రీకాకుళంలో కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదని అయన అన్నారు. కొత్త ప్రభుత్వం అభివృద్ధి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టకుండా ఉంటే చాలని అయన అన్నారు. సీఎం జగన్‌కు కనుక రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధానిని ఉంచి, రాయలసీమలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని అయన సూచించారు.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తాను పర్యటించాలనుకుంటున్నానని... తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని కోసం అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు అయన లేఖ రాశారు. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తాను అమరావతిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యటిస్తానని ఆ లేఖలో తెలిపారు.