English | Telugu
రేయ్ వెధవల్లారా.. గూబ పగులుద్ది.. వైసిపి కేడర్ కు ఎంపీ రఘురామరాజు స్ట్రాంగ్ వార్నింగ్
Updated : Aug 14, 2020
"అసలు ఏంట్రా నేను రాజీనామా చేసేది. మీరు చేయండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీ కేర్ ఫుల్. ప్రజామోదంతో నేను నెగ్గా. ఏంట్రా రాజీనామా చేసేది. యూజ్ లెస్ ఫెలోస్.. మీరు చేయండి. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబద్దాలు ఆడారు. రేయ్ గూబ పగులుద్ది. నేను నా బొమ్మతో కూడా నెగ్గా... ఒక్క జగన్ బొమ్మ వల్ల మాత్రమే గెలవ లేదు. నేను రాజీనామా చేయనని చెబుతున్నా... వెధవల్లారా. నన్నెవరైతే బెదిరించారో.. ఆ వెధవలకే చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి.. నా జోలికి రాకండి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. మీ ఏడుపు ఏంట్రా.. పనికి మాలిన వెధవల్లారా. నాకు ప్రతి రోజూ వందల కాల్స్ వస్తాయి. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకండి. పాపులు శిక్షించబడుదురు. నాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే ఎవరూ స్పందించడం లేదు. లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేశాను. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఎవరూ స్పందించలేదు. లోకాయుక్త కూడా పట్టించుకోకపోతే నేను చేయాల్సింది చేస్తాను. గోళ్లు సరిపోవు.. గొడ్డలే కావాలంటే అలాగే చూద్దాం’’ అంటూ వైసిపి నాయకులు లీడర్ల పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.