English | Telugu

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటన

ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దానిని కూల్చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 1921 లో నిర్మాణం ప్రారంభమై... 1937 లో ముగిసిందని, ఇప్పటికే దాదాపు వందేళ్లు పూర్తి అయింది అని కేంద్రం పేర్కొంది. వంద ఏళ్ల పురాతన భవనం కావడంతో.. భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. భవనం అవసరాలకు సరిపోవడం లేదని, అంతేకాకుండా ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభ‌వించినా కూడా కష్టమేనని తెలిపింది. అందుకే పాత భ‌వ‌నాల‌ను కూల్చివేసి.. అదే స్థలంలో కొత్త‌ పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది.