English | Telugu
ఈ పరిస్థితుల్లో బడాయి కి పోవడం అవసరమా.? రోజక్క
Updated : Apr 21, 2020
కరోనా, లాక్‌డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వైసిపి నేతలేమో ప్రారంభోత్సవాల్లో ఎంజాయి చేస్తున్నారు. మరికొంత మంది అయితే పూలాభిషేకాలు చేయించుకుంటూ తమ తొట్టి గ్యాంగ్‌తో జేజేలు పలికించుకుంటున్నారు. వాటర్‌మోటర్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఎమ్మెల్యే రోజాకు స్థానికులు పూలతో స్వాగతం పలికారు.
నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాల్టీ పరిధిలోని సుందరయ్యనగర్‌లో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యే రోజా పరిష్కరించారు. ఈ కాలనీలో 50కు పైగా ఇళ్ళు వున్నాయి. వారి ఇళ్లకు నీటి పైప్ లైన్ లేదు. ధీర్ఘకాలంలో మంచినీటి సమస్యతో సుందరయ్యనగర్ వాసులు బాధపడుతున్నారు. వీరి సమస్యను ఎమ్మెల్యే రోజా పరిష్కరించారు. నీటి మోటర్‌ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ నీటి మోటర్‌ను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే రోజా కాళ్లపై పూలు చల్లి స్థానికులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.