English | Telugu
ఎం.ఎల్.ఏ అబ్బయ్య గారూ... ఇంతకీ సభ్యసమాజానికి ఏమి మెసేజ్ ఇద్దామనీ!
Updated : Apr 1, 2020
* క్వారంటైన్ ను గాలికి వదిలేసి, కిక్కిరిసిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అబ్బయ్య చౌదరి
"Back to place where I worked 15 years ago
@ Red-lion Court , London Bridge.Grabbed food at the famous @ London Bridge borough market.Celebrated my princess Aashritha 8th birthday," అంటూ ఫిబ్రవరి 21 వ తేదీన దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి పెట్టిన ఫేస్ బుక్ పోస్టింగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన కుమార్తె 8 వ జన్మదినాన్ని లండన్ లో ఆయన జరుపుకునే సమయానికే అక్కడ, ఆ దేశం లో కరోనా కు సంబంధించిన హెచ్చరికలు విస్తారంగా జన బాహుళ్యానికి చేరాయి.
అయినా కూడా, క్వారంటైన్ పాటించకుండా, ఆయన జనసమ్మర్థం తో కూడుకున్న ఆ లండన్ బ్రిడ్జి ప్రాంతం లోని రెడ్ లయన్ కోర్టు లో తన కుమార్తె బర్త్ డే వేడుకలు చేసుకోవడం, 15 ఏళ్ల క్రితం తానూ అక్కడ పని చేసిన విషయాన్నీ 'ముఖ పుస్తకం ' ద్వారా గుర్తు చేసుకోవడం, నెటిజన్లను విస్మయపరిచింది.
అంతే కాదు, ఆయన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, సెల్ఫ్ క్వారంటైన్ పాటించిన దాఖలాలు కూడా కనపడలేదు. పై పెచ్చు, మార్చ్ 2 వ తేదీ న ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి లో పలువురిని పరామర్శించారు కూడా. ఆ తర్వాత, మార్చ్ 7 వ తేదీన దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెం పార్టీ కార్యాలయం లో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే రోజున, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , ఇంకా పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇదే ప్రోగ్రాం లో డెప్యూటీ సి ఎం ఆళ్ళ నాని, ఏలూరు ఎం. పి . కోటగిరి శ్రీధర్ కూడా పాల్గొన్నారు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, విదేశీ పర్యటన చేసి వచ్చిన దెందులూరు ఎం ఎల్ ఏ, తాను విజిట్ చేసిన దేశం కూడా కరోనా బారిన పడిందని, అక్కడ అప్పటికే క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుసుకోలేనంత అజ్ఞానం లో ఉండటం. దానికి తోడు, స్వదేశం వచ్చిన తర్వాత అయినా, క్వారంటైన్ పాటించకుండా, విస్తారంగా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆస్పత్రులు సందర్శించడం చేశారు. ప్రజా సేవ విషయం లో ఆయనకున్న తపనను, తహతహ ను, నిబద్ధతనూ ఎవరూ ప్రశ్నించరు కానీ, పది మందికి జాగ్రత్తలు చెప్పాల్సిన ఆయనే, వాటిని కన్వీనియెంట్ గా విస్మరించడం ఇప్పడు హాట్ టాపిక్ గామారింది. పై పెచ్చు ఆయన పాల్గొన్న ప్రతి ఈవెంట్ నూ కూడా, అంటే లండన్ లో జరిగిన ఆయన కుమార్తె పుట్టినరోజు వేడుక దగ్గర నుంచి, స్వదేశం లో ఆయన పాల్గొన్న అని కార్యక్రమాలనూ ఆయన సోషల్ మీడియా హ్యాండ్లర్లు ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లతో సహా పోస్ట్ చేస్తూ రావడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ, సభ్యసమాజానికి జగన్ సర్కార్, ఆయన ఎం ఎల్ ఏ లూ ఏం మెసేజ్ ఇద్దామనీ అని జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.