English | Telugu

సరికొత్త క్యాబ్ సర్వీసును ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్...

హైదరాబాద్ లో మరో కొత్త క్యాబ్ సర్వీస్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రైడో క్యాబ్స్ పేరుతో వస్తున్న సంస్థ ఆప్ ను, లోగోను మంత్రి హరీశ్ రావు లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు ప్రైడో సంస్థ పక్కా హైదరాబాద్ కు చెందిన కంపెనీ అని ఇది చాలా తక్కువ సమయంలో సక్సెస్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైడో క్యాబ్స్ లాభాల కోసమే కాదని సురక్షితంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది అని అన్నారు.

కంపెనీ తెలంగాణకే పరిమితం కాకుండా గ్లోబల్ కంపెనీగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. దీనిపై ప్రైడో క్యాబ్ ఎండీ కోదండరాం మాట్లాడుతూ గౌరవనీయులు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రైడోను లాంచ్ చేశామని, అయితే ఈ సర్వీసుల్ని ముందుగా పైలేట్ బేసిస్ మీద ఒకటి నుంచి రెండు నెలలు హైదరాబాద్ లో నడిపిన తరువాత మిగతా నగరాలకు విస్తరిస్తారని అన్నారు. బెంగుళూరు, ఢిల్లీ మిగతా మెట్రో సిటీలకు త్వరలోనే అందిస్తామన్నారు.

మహిళలను కూడా ఈ ప్రైడో లో లేడీ డ్రైవర్లుగా భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. కాబట్టి డ్రైవర్ అన్ బోర్డింగ్ ప్రక్రియ రెండు, మూడు నెలల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. చాలా మంది డ్రైవర్ సోదరులు తమ మీద ఉన్న నమ్మకంతో తాము ఒక కొత్త ఒరవడిని సృష్టించగలమనే నమ్మకంతో తమ మీద విశ్వాసం ఉంచారని కోదండరాం తెలిపారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా డ్రైవర్ సోదరులకి, కస్టమర్ లకి అందరికీ మంచి సర్వీసులను అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.