English | Telugu

సమ్మక్క సారక్కకు బెల్లం అంటే భలే ఇష్టం... అందుకే బెల్లంతో మొక్కులు...

వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు బెల్లం అంటే ప్రీతి. అందుకే, మేడారం జాతరకు వచ్చే భక్తులు... సమ్మక్క సారక్కలకు బెల్లం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. అలా, వనదేవతలకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. కొందరు భక్తులు తమ బరువుకు తగ్గ బెల్లాన్ని తూకమేసి సమర్పిస్తారు. మెజారిటీ భక్తులు తమ స్థోమతకు తగినవిధంగా బెల్లం బంగారాన్ని తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

అయితే, మేడారం జాతర వచ్చిందంటే బెల్లం ధరలకు ఒక్కసారి రెక్కలు వచ్చేస్తాయి. వ్యాపారులు ఒక్కసారిగా రేటు పెంచేస్తారు. సాధారణంగా కిలో బెల్లం ధర 35 రూపాయల్లోపు ఉంటే... మేడారం జాతర సందర్భంగా దాదాపు 15 రూపాయలు వరకు పెంచేసి కిలో 50కి అమ్ముతున్నారు. అయితే, బెల్లం ధరలు పెంచేసినా అమ్మవార్లకు మొక్కు చెల్లించడం తప్పనిసరి కావడంతో కొందరు భక్తులు చక్కెర సమర్పిస్తున్నారు.