English | Telugu

ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య బంగారం పెడుతున్న చిచ్చు...

చెన్నై లోని లలితా జ్యువెలరీ చోరీ కేసులో కొత్త మలుపు వెలుగు చూసింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరువారూరు మురుగన్ అనూహ్యంగా కోర్ట్ లో లొంగిపోయాడు. మురుగన్ నుంచి పది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారం తమదంటే తమదంటూ కర్ణాటక, తమిళనాడు పోలీసులు కుస్తీపడుతున్నారు.

చెన్నై లలిత జ్యువెలరీలో చోరికి సూత్రధారి మురుగన్ నుంచి స్వాధీనం చేసుకున్నబంగారం లలితా జ్యువెలరీ కేసుకు సంబంధించిదేనని తమిళనాడు పోలీసులు చెబుతుండగా కర్ణాటక పోలీసులు మాత్రం కాదంటూ వాదిస్తున్నారు.

దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గోల్డ్ వార్ నెలకొంది. మరోవైపు మురుగన్ రూపురేఖలే మార్చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ తో స్మార్ట్ గా తయారయ్యాడు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ లోని మురికి నీటిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఫోటో ఆధారంగా పోలీసులు స్థానికులను విచారించారు. అయితే అతని తామెప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు తొలినాళ్లలో అనారోగ్యంతో ఉన్న మురుగన్ ఫొటోను ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఫోటోను పరిశీలించగా సర్జరీ చేయించుకున్నట్లు తేల్చారు.

సర్జరీ కారణం గానే మురుగన్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. మురుగన్ తన బినామీ పేర్ల తో పది ఏళ్ళల్లో సుమారు వంద కోట్ల వరకు కూడబెట్టినట్లు అనుమనిస్తున్నారు. అందులో అధిక మొత్తాన్ని సినిమాల నిర్మాణాల కోసమే ఖర్చు పెట్టినట్టు గుర్తించారు. లలిత జూలరీలో చోరీ చేశాక ఆ నగలను మధురై వ్యాపారికి ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.

దీంతో అక్కడి నుంచి అయిదు కిలోల నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగితావి మురుగన్ సురేష్ ల వద్ద ఉన్నాయని అనుమనిస్తున్నారు. ఈ నేపథ్యం లో వారిని కస్టడీ లోకి తీసుకుంటే కేసులో అన్ని నిజాలు ఒక కోలిక్కి వస్తాయన్న ఆలోచన లో ఉన్నారు చెన్నై పోలీసులు.మరి ఈ కేసు ఇంకెన్ని కోనాలు తిరగబోతుందో వేచి చూడాలి.