English | Telugu
ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు.. కర్నూల్ జిల్లాలో మరో విగ్రహం ధ్వంసం..
Updated : Sep 23, 2020
ఈ దేవాలయం మంత్రాలయం నుండి బెంగళూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రతిష్టించారు. ఈ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ స్వామి వారిని స్థానికులు, రైతులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో, ఎవరు రోడ్డుపై పడేశారో తేల్చాలని స్థానికులు, హిందూ ధర్మ పరిరక్షకులూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.