English | Telugu
మళ్లీ లాక్‌డౌన్.. కరోనా కట్టడికి సరైన మార్గం
Updated : Jul 14, 2020
పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా లాక్ డౌన్ ఎందుకు విధించడం లేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వైద్యపరీక్షలు నిర్వహించి పాజిటివ్ వ్యక్తులను ట్రేస్ చేయడం, వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. దాంతోపాటు వ్యాప్తిని నియంత్రించాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని చాలా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రబృందం సూచనల మేరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో హైదరాబాద్‌లో తిరిగి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు అధికంగా ఉన్నపాత బస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని క్లస్టర్ జోన్‌గా గుర్తించి రాకపోకలు నిలిపేస్తారు.