English | Telugu
కరోనా కు వ్యాక్సిన్ రెడీ.. కానీ డబ్ల్యూహెచ్ఓ నే అడ్డు..!
Updated : Jul 14, 2020
ఐతే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక కొత్త మందును విడుదల చేయాలంటే దానికి కావాల్సిన ముఖ్య పదార్ధాలు సమకూర్చుకుంటే సరిపోతుంది. కానీ అదే ఒక కొత్త వ్యాక్సిన్ ఐతే అందులో అటు సూక్ష్మ క్రిములు కానీ వాటి జన్యువులు కానీ ఉంటాయి. ఐతే అవి స్వయంగా ఉత్పత్తి కావడానికి ఒక ప్రత్యేక వాతావరణం తో పాటు కొంత సమయం కూడా అవసరమే. దీంతో ఒక పక్క వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క దీని ఉత్పత్తి పైన దృష్టి పెట్టారు. ఐతే ఇప్పటివరకూ తమ పరిశోధనలో తాము రెడీ చేసిన వ్యాక్సిన్ చాలా సేఫ్ అని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనీ గమలాయి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను ఆగస్ట్ 12 నుంచి 14 మధ్య తొలి వ్యాక్సిన్ ప్రజల చేతిలోకి వెళ్తుందనే అయన కాన్ఫిడెంట్ గా తెలిపారు
ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్స్ ప్రకారం ఏ వ్యాక్సిన్‌కైనా మూడు దశల్లో ట్రయల్స్ జరపవలసి ఉంటుంది. కానీ రష్యా శాస్త్రవేత్తలు ఒక దశ ట్రయల్స్ మాత్రమే చేశారని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రపంచం మొత్తం వాడే వ్యాక్సిన్‌కి కనీసం మూడుసార్లైనా ట్రయల్స్ జరపకపోతే ఎలా అని ఈ వ్యాక్సిన్ కు అభ్యంతరం చెబుతోంది. సెచెనోవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసు వారిని 28 రోజులపాటూ ఐసోలేషన్‌లో ఉంచి ఇప్పటికే రెండు ట్రయల్స్ జరిపామంటున్నారు. ఈ వాలంటీర్లను జులై 15, జులై 20న డిశ్చార్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా వారిని ఆ తర్వాత కూడా మరో 6 నెలల పాటు పరిశీలిస్తామని తెలియ చేసింది. ఏది ఏమైనా ఒక వేళ డబ్ల్యూహెచ్ఓ కనుక ఆమోదించకపోతే మాత్రం ఆగస్టులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.