కరోనా (కొవిడ్ -19) వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వార్తలొస్తున్నాయనీ, అయితే ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన ఏదీ తమవద్ద లేదనీ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీనిపై కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఒక ప్రకటన విడుదల చేస్తూ- ‘‘లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలు విని నాకు ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవు’’ అని వివరించారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1024 కేసులు నమోదవ్వగా, ఏపీలో 21, తెలంగాణలో 70 కేసులు నమోదయ్యాయి.