English | Telugu

ఉపశమనాన్ని కలిగిస్తూ తగ్గుముఖం బాటలో బంగారం ధరలు...

బంగారం అంటే ప్రీతి ఉండని వారు ఎవ్వరూ ఉండరు. ఇటీవలే తారా స్థాయికి చేరిన బంగారం ధరలు చూసి అమ్మో అని గుండెల మీద చెయ్యి వేసుకున్నారు ప్రజలు. బంగారం కొనుగోలుదారులకు దసరా కంటే ముందుగానే వారు పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. దానికి కారణం తగ్గిన బంగారం ధరలే. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు, విశాఖపట్టణంలో ముప్పై తొమ్మిది వేల నూట యాభై రుపాయలు, ప్రొద్దుటూరులో ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు, చెన్నైలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్ లో ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై రూపాలు. విశాఖపట్నంలో ముప్పై ఆరు వేల పది రూపాయలు, ప్రొద్దుటూరులో ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు, చెన్నైలో ముప్పై ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదు నలభై ఐదు వేల నాలుగు వందలు, విశాఖపట్నంలో నలభై ఆరు వేల రెండు వందలు, ప్రొద్దుటూరులో నలభై ఐదు వేల ఏడు వందలు, చెన్నైలో నలభై తొమ్మిది వేల మూడు వందల వద్ద ముగిసింది.ముహుర్తాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్న సందర్భంగా బంగారం కొనుగోలు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.