English | Telugu

మందుల్లోనే కాదు...అందులోనూ దోచేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో కొత్త కోణాలు

ఈఎస్‌ఐ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేసిన ఏసీబీ.... ఇప్పటివరకు 8మందిని అరెస్ట్‌చేసి... వంద మందిని ప్రశ్నించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్ వసంత, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌, ఫార్మాసిస్ట్‌ రాధిక, ఓమ్నీ మెడి ఎంపీ శ్రీహరి, ఓమ్మీ మెడి నాగరాజును రిమాండ్‌‌కు రిమాండ్‌కి తరలించిన ఏసీబీ.... నిందితులందరినీ కస్టడీ ఇవ్వాలని కోరును కోరింది. నిందితులను సమగ్రంగా ఇంటరాగేషన్ చేస్తేనే, ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం స్కామ్ విలువ వందల కోట్లలో ఉండటంతో నిందితుల ఆస్తుల వివరాలను సేకరిస్తోంది ఏసీబీ. భవనాలు, కార్లు... ఇలా అన్నింటి విలువను లెక్కగడుతున్నారు.

అయితే, కేవలం మందులే కాకుండా, వివిధ డిస్పెన్సరీల్లో వినియోగించే స్టేషనరీ, మెడికల్ ఎక్విప్‌మెంట్‌ కొనుగోళ్లలోనూ కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేసినట్లు గుర్తించారు. దాంతో, ఆయా డిస్పెన్సరీలకు సంబంధించిన ఇండెంట్లు, పర్చేజ్ ఆర్డర్లు, బిల్లులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 70 డిస్పెన్సరీల్లో పర్చేజ్ ఆర్డర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ ఐఏఎస్‌, ఒక ఓఎస్డీ పాత్ర ఉందన్న సమాచారంపైనా దర్యాప్తు జరుగుతోందన్న ఏసీబీ ఉన్నతాధికారులు.... వారం రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయంటూ సంకేతాలిచ్చారు.