English | Telugu
టిడిపి నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం
Updated : Mar 5, 2020
చంద్రబాబు వల్లే నష్టపోయానంటూ సూసైడ్ నోట్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణంగానే తాను సర్వం కోల్పోయానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు ప్రయత్నించారు టిడిపి సీనియర్ నేత బంగి అనంతయ్య.
కర్నూల్ పట్టణంలో సీనియర్ టిడిపి నేత రాజకీయాలపై వైరాగ్యం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో బంగి అనంతయ్య ఇంట్లో ఉరి వేసుకున్నారు. అయితే అదే సమయానికి కుటుంబ సభ్యులు రావడంతో ఉరి నుంచి తప్పించి హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా వుంది. అయితే తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడానికి గల కారణాలను సూసైడ్ నోట్‌లో రాశారు.
ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం శ్రమించిన తనకు మాత్రం ఫలితం దక్కలేదని నోట్‌లో ఆయన పేర్కొన్నారు.
తాను ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా చంద్రబాబు తనను పట్టించుకోలేదని నోట్‌లో బంగి అనంతయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా తన ఎదుగుదల దెబ్బతీసి తొక్కాశారంటూ సూసైడ్ నోట్‌లో బంగి అనంతయ్య ఆవేదన వ్యక్తం చేశారు.