English | Telugu

కర్నూలు జిల్లాలో 24 మందికి కరోనా నుంచి విముక్తి

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా నుంచి విముక్తి పొందినట్టు చెప్పారు.

ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు నగరం 7 మంది; నంద్యాల పట్టణం 7 మంది; పాణ్యం - ఇద్దరు; సిరివేళ్ళ-ఇద్దరు; గడివేముల -ఒక్కరు; రుద్రవరం -ఒక్కరు; నందికొట్కూరు- ఇద్దరు; ఆత్మకూరు- ఒక్కరు; డోన్ - ఒక్కరు. వీరందరూ కూడా పురుషులే. కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి... డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందించారు, తర్వాత ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు.

ఈ నెల 6న జిల్లా కోవిడ్ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్ వార్డులలో ఆ 24 మందికి నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు వివరించారు.