English | Telugu

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం తో ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోమటిరెడ్డి కోరారు.

ఇక తెలంగాణ‌లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులున్నాయి.