English | Telugu

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా

ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల మంత్రిని కలిసినవారి వివరాలు తీసుకుని వారికి కూడా పరీక్షలు నిర్వహించే పనిలో ఉన్నారు అధికారులు.